Home » Konda Surekha
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. లగచర్ల ఘటన కలెక్టర్‌పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
Telangana: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.
‘రాహుల్‌గాంధీ కులం ఏంటన్నది తెలియాలంటే దేశంలో కులగణన చేయండి. కులగణన పత్రంతో రాహుల్ ఇంటికి వెళితే.. తన కులమేదో ఆయనే చెబుతారు’ అంటూ బీజేపీ నేతలకు మంత్రి కొండా సురేఖ సలహా ఇచ్చారు.
కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గరుకుల విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రతి సోమవారం దీపోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో కార్తీకమాస వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
అటవీ అనుమతుల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో 59 రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోయాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన రూ.100 కోట్ల సివిల్ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.