• Home » KonaSeema

KonaSeema

వాడీవేడిగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

వాడీవేడిగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

అమలాపురం పురపాలక సంఘంలో చెరువుల ఆక్రమణలు.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు.. రక్షిత తాగునీటికి బదులు కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అంశాలపై అధికార, విపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత తాగునీటిని సరఫరా చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఉందన్నారు.

 గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలి

గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలి

గ్రామ, మండల స్థాయిలో ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. మండపేట మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.

పార్టీలకతీతంగా సిండికేట్‌

పార్టీలకతీతంగా సిండికేట్‌

ప్రభుత్వ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. లాబీయింగ్‌లతో రాజకీయ పార్టీలకు అతీతంగా మద్యం వ్యాపారులంతా ఒక్కటై సిండికేట్లకు రూపకల్పన చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని 133 ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 300కు పైగా దరఖాస్తులు దాఖలైనట్టు సమాచారం. రానున్న మూడు రోజుల గడువులో వీటి సంఖ్య మరింత పెరగనుంది.

వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట

వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు

వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి

వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి

గోదావరిలో వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక ర్యాంపులలో తవ్వకాలకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో ఇసుక ర్యాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలని సూచనలు చేసిన నేపథ్యంలో ర్యాంపులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు.

ఫెర్రీ రేవు మూతపడడంతో ప్రయాణికుల ఇబ్బందులు

ఫెర్రీ రేవు మూతపడడంతో ప్రయాణికుల ఇబ్బందులు

కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవు మూతపడడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లడానికి రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల ప్రజలతో పాటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

హైవేల విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష

హైవేల విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష

జాతీయ రహదారి-216 విస్తరణ అభివృద్ధి పనులపై వస్తున్న అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పాశర్లపూడి, మామిడికుదురులలో వచ్చిన అభ్యంతరాలపై ఆయన కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్షించారు. విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న భవన నిర్మాణాల విలువల గణనలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయేమో పునఃపరిశీలన చేసి తాజాగా నివేదిక అందించాలని ఆదేశించారు.

రెవెన్యూ అంశాలపై అవగాహనతో ఉండాలి

రెవెన్యూ అంశాలపై అవగాహనతో ఉండాలి

రెవెన్యూ అంశాల పట్ల అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. అసైన్డ్‌ భూములు, భూ తనిఖీ రిజిస్ర్టేషన్‌ తదితర నివేదికలను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. అదనపు భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం అమరావతి నుంచి జిల్లాలోని జేసీలు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 మహాత్మా మన్నించు

మహాత్మా మన్నించు

గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు, మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. అంబాజీపేటలో బుధవారం సంత మార్కెట్‌లో మాంసం, చేపల విక్రయాలు యఽథేచ్ఛగా జరిగాయి.

 133 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

133 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

నూతన మద్యం షాపుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 22 మండలాల పరిధిలో 133 మద్యం షాపుల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి