• Home » KonaSeema

KonaSeema

మందుబాబులకు పండగ

మందుబాబులకు పండగ

ప్రభుత్వ మద్యం దుకాణాలు కాస్తా బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు కావడం, అలాగే ఇప్పటివరకు రకరకాల బ్రాండ్లను తాగి విసిగివేసారిపోయిన మందుబాబులకు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులకు పండుగ వాతావరణం మొదలైంది.

 ఉద్యమమే ఊపిరిగా

ఉద్యమమే ఊపిరిగా

ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి, ఉద్యమాలతో ప్రభుత్వాలపై గళం విప్పే చైతన్యమూర్తి విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోకరకొండ సాయిబాబా. ఆయన శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో మృతిచెందారన్న వార్త కోనసీమ వాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అమలాపురంలో పుట్టిన సాయిబాబా గురించి తెలిసినవారెవరైనా ఆయన ఉద్యమ మార్గాన్ని కొనియాడుతున్నారు.

Viral: పోలీస్ స్టేషన్‌లో పురోహితుడి కత్తి విన్యాసం.. వైరల్ వీడియో

Viral: పోలీస్ స్టేషన్‌లో పురోహితుడి కత్తి విన్యాసం.. వైరల్ వీడియో

పురోహితులంతా వేద మంత్ర పఠనాన్నే కాదు.. కొందరు యుద్ధ విద్యలోనూ ఆరితేరి ఉంటారన్నడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

ఉపాధి కోసం వెళ్లి.మృత్యువుతో పోరాటం

ఉపాధి కోసం వెళ్లి.మృత్యువుతో పోరాటం

అసలే కూలి బతుకులు. పనులు కూడా సక్రమంగా లేక అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ పస్తులుండక తప్పేది కాదు. దీంతో భార్యా పిల్లలను సంతోషంగా చూసుకోవాలని అప్పులు చేసి కోటి ఆశలతో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు.

వరప్రసాద్‌మే

వరప్రసాద్‌మే

అన్నవరం దేవస్థానానికి ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి. వేలాది మంది భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్న ఆలయానికి భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రంగం సిద్ధమవుతోంది. గత వైసీపీ సర్కారు నిర్వాకంతో మూడేళ్లుగా అసలే మాత్రం పట్టాలెక్కని ప్రసాద్‌స్కీం పనులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం రాకతో కదలిక వచ్చింది.

పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు

పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు

విద్యార్థి దశ నుంచి క్రీడల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పిఠాపురం నియోజకవర్గాల్లోని పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు అందజేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీసుకున్న చొరవతో త్వరలో పాఠశాలలకు స్పోర్ట్స్‌ కిట్లు అందనున్నాయి. పాఠశాలల్లో విద్యాబోధనతోపాటు క్రీడలకు ఉన్న సౌకర్యాలపై ఇటీవల పవన్‌కల్యాణ్‌ ఆరా తీశారు. ఇందులో భాగం గా నియోజకవర్గంలోని 32 ఉన్నత, ప్రాఽథమికోన్నత పాఠశాలలు, ప్రాఽథమిక పాఠశాలలుకు క్రీడాసామగ్రి కిట్లు సమకూర్చాలని నిర్ణ యించారు.

చెడీతాలింఖానా సన్నాహాక ప్రదర్శన

చెడీతాలింఖానా సన్నాహాక ప్రదర్శన

అమలాపురం మహిపాలవీధిలోని శ్రీఅబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 169వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శన బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. చెడీ తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సన్నాహాక ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

  12 ఇసుక రీచ్‌లకు అనుమతులు

12 ఇసుక రీచ్‌లకు అనుమతులు

నదిలో నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్నిశాఖల అనుమతులతో పన్నెండు ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌.మహేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది.

Devinavaratri: కోనసీమలో కరెన్సీ అమ్మవారు..

Devinavaratri: కోనసీమలో కరెన్సీ అమ్మవారు..

Andhrapradesh: ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఆ దేవదేవిని చూసేందుకు భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోనసీమలో ఓ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సర్వసన్నద్ధం కావాలి

ధాన్యం కొనుగోళ్లకు సర్వసన్నద్ధం కావాలి

ధాన్యం సేకరణకు అధికారులు సర్వసన్నద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. కోనసీమ జిల్లాలో 4.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రస్తుత సీజన్‌లో విక్రయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, పొరపాట్లు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. నవంబరు మొదటి వారంలోనే ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి