Home » KonaSeema
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్‌కల్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్లు నిలుపుదల చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. పిఠాపురం మున్సిపాల్టీ పరిధిలో సామర్లకోట, ఉప్పాడ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం వివరిస్తూ ఆర్‌వోబీ మంజూరు చేయాలని కోరారు.
గత వైసీపీ ప్రభుత్వ పాపాలతో జిల్లాలో భూవివాదాలు, కబ్జాలపై ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయి. న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తోన్న బాధితుల సంఖ్యను పెంచుతున్నాయి. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు, రీసర్వే పేరుతో భూములు లాగేసుకున్నారని మరికొందరు కూటమి ప్రభుత్వాన్ని భారీగా ఆశ్రయిస్తున్నారు.
జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్‌మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రైతులు సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మిల్లర్లకు వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు ప్రతీ నెల పెన్షన్ తీసుకోవాల్సిందే. ఒక నెల అందుబాటులో లేకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్ వచ్చేది కాదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక నెల పెన్షన్ నగదు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తర్వాత నెల పెన్షన్‌తో కలిపి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కో సందర్భంలో రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం నగదును అందజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ అందించే ఇండియన్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (కర్నూలు) సాంకేతిక ప్రతినిధులు కె.కృష్ణనాయక్, నరేష్‌బాబు, విష్ణుమూర్తి కలెక్టర్‌తో సమావేశమై సమీక్షించారు.
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సంబంధిత ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. 84 ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చైల్డ్‌కేర్ సెంటర్‌లలో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం తదితర సమస్యలను గుర్తించేందుకు ఒక్కో వసతిగృహానికి ప్రత్యేక అధికారితో పాటు ఇంజనీర్‌ను నియమించామన్నారు.
పేదల బియ్యాన్ని కొంతమంది అధికారులు మేధావితనంతో పక్కదారి పట్టించారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా మాయం చేశారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తానికి ఈ అవినీతి బాగోతం అధికారుల బదిలీలతో బయటపడింది. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..
సాంకేతికంగా అర్హత సాధించి అతి తక్కువ ధరలో కోట్ చేసిన వారికే ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇస్తామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు. జిల్లాలోని పన్నెండు ఇసుక రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు, వాహనాల లోడింగ్, స్టాకు పాయింట్ల వరకు రవాణా, స్టాకు పాయింట్ల నుంచి వాహనాల్లో ఇసుకను లోడ్ చేయడానికి చార్జీల వసూళ్ల నిమిత్తం పిలిచిన షీల్డు టెండర్ల టెక్నికల్ బిడ్‌లను పూర్తి పారదర్శకతతో ధ్రువీకరించాలని సూచించారు.
ఈ నెల 14 నుంచి నాన్ కమ్యూనకబుల్ వ్యాధుల 3.0 ఇంటింటా సర్వేను ప్రారంభించిన మొత్తం 9 నెలల పాటు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నోటి కేన్సర్, రొమ్ముకేన్సర్, గర్భాశయ కేన్సర్ స్ర్కీనింగ్ నిర్వహిస్తారన్నారు.
కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవులో రాకపోకల పునరుద్ధరణ కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిత్యం ఇబ్బందులు పడలేక దయతలచాలని అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో భక్తులు రేవులో రాకపోకలు లేక చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది.