Home » KonaSeema
పేదల బియ్యాన్ని కొంతమంది అధికారులు మేధావితనంతో పక్కదారి పట్టించారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా మాయం చేశారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తానికి ఈ అవినీతి బాగోతం అధికారుల బదిలీలతో బయటపడింది. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..
సాంకేతికంగా అర్హత సాధించి అతి తక్కువ ధరలో కోట్ చేసిన వారికే ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇస్తామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు. జిల్లాలోని పన్నెండు ఇసుక రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు, వాహనాల లోడింగ్, స్టాకు పాయింట్ల వరకు రవాణా, స్టాకు పాయింట్ల నుంచి వాహనాల్లో ఇసుకను లోడ్ చేయడానికి చార్జీల వసూళ్ల నిమిత్తం పిలిచిన షీల్డు టెండర్ల టెక్నికల్ బిడ్‌లను పూర్తి పారదర్శకతతో ధ్రువీకరించాలని సూచించారు.
ఈ నెల 14 నుంచి నాన్ కమ్యూనకబుల్ వ్యాధుల 3.0 ఇంటింటా సర్వేను ప్రారంభించిన మొత్తం 9 నెలల పాటు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నోటి కేన్సర్, రొమ్ముకేన్సర్, గర్భాశయ కేన్సర్ స్ర్కీనింగ్ నిర్వహిస్తారన్నారు.
కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవులో రాకపోకల పునరుద్ధరణ కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిత్యం ఇబ్బందులు పడలేక దయతలచాలని అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో భక్తులు రేవులో రాకపోకలు లేక చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది.
విద్యార్థుల పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉండే అపార్ నమోదు జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. మిగిలిన 30 శాతం అపార్ నమోదును పూర్తి చేసేందుకు పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు 60 శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల రెండో విడత జాబితా పలువురికి ఝలక్ ఇచ్చింది. మలివిడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీకి చెందిన ఓ కీలక నేతను మాత్రమే పదవి వరించింది. ఆశలు పెంచుకున్న ఎందరో నేతలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. పార్టీ అఽధిష్ఠానం తమ పేర్లను పట్టించుకోకపోవడంపై కొందరు టీడీపీ నేతలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు
ఆత్రేయపురం, నవంబరు8(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శిం
జిల్లాలో దాళ్వా సాగుకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకుడు బోసుబాబు తెలిపారు. మండపేట మండలం ద్వారపూడి వచ్చిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రామచంద్రపురం, మండపేట ఆలమూరు, రాయవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయన్నారు.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకతీసి స్టాకు యార్డుకు తరలించేందుకు అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం టెండర్లను స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 12 ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తీసి స్టాకు యార్డులకు తరలించేందుకు గత నెల 31వ తేదీన జిల్లా శాండ్ కమిటీ టెండర్లు స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వారం రోజులు వ్యవధి ఇచ్చి జారీ చేసిన ఈ నోటిఫికేషన్ గడువు గురువారం ముగియడంతో పెద్ద సంఖ్యలో టెండరుదారులు ఇసుక ర్యాంపుల కోసం తమ టెండర్లను బాక్సులో వేశారు.
తెలంగాణలో మాయమై ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షమయ్యారు అఘోరి. రాష్ట్రంలో వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. పనిలో పనిగా రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.