• Home » Kollu Ravindra

Kollu Ravindra

పేర్ని నానిపై  మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.

AP News: రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP News: రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: ఏపీ గనులు - భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ మూడో బ్లాక్‌లో ఆయన తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు.

 Kollu Ravindra: నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు

Kollu Ravindra: నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు

యువతను మత్తులో పెట్టి, గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి రెండు కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Nadendla Manohar: మొన్న కొల్లు రవీంద్ర.. నేడు నాదెండ్ల మనోహర్..

Nadendla Manohar: మొన్న కొల్లు రవీంద్ర.. నేడు నాదెండ్ల మనోహర్..

పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు

Kollu Ravindra: ఆకస్మిక పర్యటనలతో అధికారులను హడలెత్తిస్తున్న కొల్లు రవీంద్ర

Kollu Ravindra: ఆకస్మిక పర్యటనలతో అధికారులను హడలెత్తిస్తున్న కొల్లు రవీంద్ర

ఎన్నికైన వెంటనే అలసత్వం ప్రదర్శించక టీడీపీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. తమ నిజయోజకవర్గంలోని సమస్యలపై అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆకస్మిక పర్యటనలతో కొల్లు రవీంద్ర అధికారులను హడలెత్తిస్తున్నారు.

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వేర్వేరు చోట రాళ్ల దాడి ఘటనలకు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ ఘటనలకు అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా రాళ్లదాడిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే సీఎం జగన్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై జరిగిన రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి