Home » Kolkata
నగరంలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారం కారణంగా మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులకు తొలుత ఆసుపత్రి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలింది.
ట్రైనీ వైద్యురాలు హత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన భయానకమైనదన్నారు. అలాగే హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ప్రొ. సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు.
కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నగరంలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆదివారం విధుల నుంచి తొలగించింది.
కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
లైంగిక దాడి చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసినట్లు నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైందన్నారు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి తీవ్రంగా రక్త స్రావమైందని తెలిపారు. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించామన్నారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎ్‌సఎఫ్ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి.
సీపీఎం దిగ్గజ నేత, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) ఇకలేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి.