Home » Kolkata
కోల్‌కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ: కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు.
ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన
మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏఎస్ఐ అరుప్ దత్తా సీబీఐ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.
కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్‌కతా కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది.
సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాలేజీ విద్యార్థి కీర్తి శర్మ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కోల్‌కతా మహానగరంలో లేక్ టౌన్‌లోని నివాసంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ఆగస్టు 9న మహిళా వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ విషాద ఘటన విషయంలో మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ రాసిన గవర్నర్‌కు బహిరంగ లేఖ రాశారు.
స్థానిక ఆర్.జి. కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురయిన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని ఆమె తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుపై మమత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగులేదని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె
కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తూ ఆదివారం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది.