Home » Kolkata
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు.మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు.
పశ్చిమబెంగాల్‌లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
కోల్‌కతా హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్.. పాలీగ్రాఫ్ పరీక్షలో ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి సోమవారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు అధికారులు బయటకి వెల్లడించలేదు.
మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతోపాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సీబీఐ ఆదివారం సోదాలు జరిపింది.
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడని కోల్‌కతా పోలీసులు గతంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నిందితుడు మాత్రం తనను ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు CBI ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించనుంది.
జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాటమార్చేశాడు.