Home » Khammam
సీనియర్ రాజకీయవేత్త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(73) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.
ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలోని ఓహియో రాష్ట్ర గవర్నర్ సలహాదారుగా తెలుగు మహిళ రామసహాయం రాధిక నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన బుచ్చిరెడ్డి- నిర్మల దంపతుల పెద్ద కుమార్తె రాధిక 2006లో గద్వాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్నట్లే స్థానిక ప్రజాప్రతినిధులకు పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని జాతీయ పంచాయతీరాజ్ చాంబర్ రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం డిమాండ్ చేసింది.
ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్‌ఎం)పై సస్పెన్షన్ వేటు పడింది.