Home » Khammam
తెలంగాణలో చిరుత పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచారం, కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15వ తేదీ లోపు వెలువడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు.
అనారోగ్యం బారిన పడిన ఓ అంబోతు దానంతట అదే ఏరియా ఆస్పత్రికి వచ్చింది! ఆస్పత్రి ఆవరణలోనే కదలకుండా ఉంటున్న దానిని 108 సిబ్బంది గమనించి పశువైద్యులకు సమాచారమిచ్చారు.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మునిసిపల్ వార్డు ఆఫీసర్ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో జరిగింది.
రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్యాంకుల్లో నిధులు జమ చేస్తున్నామని.. సోమవారం నుంచి నగదు తీసుకోవచ్చునని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది.
Mallu Bhatti Vikramarka: ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మాత్రం ఆగవని ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిరుపేదలను పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.
Komatireddy Venkat Reddy: గత కేసీఆర్ పాలనపై మరోసారి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. అలాగే గత పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించిన ఇవ్వలేదన్నారు.
తమ కూతురిని కడసారి చూసేందుకు వారు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామానికొచ్చారు.
హైదరాబాద్ నగరానికి చెందిన పాన్‌మసాలా బడావ్యాపారి బొల్లు రమేశ్(51) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులు కారులో కూసుమంచి తీసుకొచ్చి హత్య చేశారు.