Home » Khammam
గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.
CPI Narayana: బీజేపీపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకుని వచ్చారని నారాయణ చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా ఖమ్మం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగార్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి వాహన రాకపోకలను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో గురువారం నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు ఖమ్మం జిల్లా వారే.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కారును గెల్చుకున్న రైతు గుడిపూడి శ్రీనివాసరావుకు బుధవారం ఖమ్మం యూనిట్ కార్యాలయంలో చెక్కు అందజేశారు.
ఏం జరిగిందో తెలియదు.. ఎలా జరిగిందో తెలియదు. కానీ.. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాత్రం తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సాయినగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
KTR Supports Indian Army: పాకిస్థాన్‌తో భారతదేశం పోరాడుతోందని.. ఇండియన్ ఆర్మీకి అండగా నిలుద్దామని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.