Home » Khammam News
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల మేలు కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Minister Thummala: దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కొత్తగూడెం కేరాఫ్‌గా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వ పక్షాన గట్టి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
Police Stations in Settlements: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా పోలీస్‌స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నారు. కోయ భాష మీద ప్రేమతో పెళ్లికొడుకు ఉండమీరి శ్రీనివాస్ ఆ భాషను తన పెళ్లి పత్రికపై ముద్రించాడు.
BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామని అన్నారు.
ఖమ్మం: జిల్లా కలెక్టర్ అంటేనే పెద్ద బాధ్యత. సమీక్షలు, సమావేశాలు అంటూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంటారు. ముఖ్యమంత్రితో చర్చలు, మంత్రులతో మీటింగులు, అధికారులతో సమావేశాలంటూ ఊపిరాడని పని ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి గడిపే సమయం కూడా వారికి దొరకడం కష్టంగా మారుతుంటుంది.
Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.
Telangana:ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. బస్సు టైరు పేలడంతోనే ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది.యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది.
Minister Thummala Nageswara Rao: నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరానికి కేబుల్ బ్రిడ్జి ఐకానిక్‌గా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.