Home » Khammam News
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను తరిమికొట్టాలని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.362 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పని చేస్తోందన్నారు.
ఈనెల 18వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా ఏదులాపురానికి విచ్చేస్తున్నారు. అక్కడ జరిగే ఆయా పనులకు ఆయన శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లాలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొననున్నారు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ దీవెనలతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది.
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.
పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది, గురువారం సాయంత్రానికి అధికారుల అంచనా ప్రకారం సుమారు 45వేల క్యూసెక్కులనీరు పరీవాహకప్రాంతాలనుంచి పాలేరు జలాశయానికి వస్తోంది.