• Home » Kesineni Nani

Kesineni Nani

Chandra Babu Arrest : అమిత్ షా‌కు కేశినేని నాని లేఖ.. చంద్రబాబు అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని వినతి..

Chandra Babu Arrest : అమిత్ షా‌కు కేశినేని నాని లేఖ.. చంద్రబాబు అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని వినతి..

తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Kesineni Nani : చంద్రబాబు అవినీతి అనే మచ్చలేని నాయకుడు

Kesineni Nani : చంద్రబాబు అవినీతి అనే మచ్చలేని నాయకుడు

టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు.

Kesineni Nani : మీడియా తీరుపై కేశినేని నాని సెటైర్లు

Kesineni Nani : మీడియా తీరుపై కేశినేని నాని సెటైర్లు

మీడియా తీరుపై ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఈ నెల 28 న ఢిల్లీలో జరగనున్న ఎన్టీఆర్ కాయిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. అర్హత ఉన్న వారి ఓట్లను తొలగించడం చాలా తప్పని అన్నారు. ఒక వర్గం, ఒక పార్టీ వారిగా గుర్తించి ఓట్లు తొలగించడం కరెక్టు కాదన్నారు.

Keshineni Nani: జగన్ సర్కార్‌పై కేశినేని నాని ఫైర్.. టీడీపీలో ఆసక్తికర చర్చ

Keshineni Nani: జగన్ సర్కార్‌పై కేశినేని నాని ఫైర్.. టీడీపీలో ఆసక్తికర చర్చ

శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని విజయవాడ టీడీపీ కేశినేని నాని (Keshineni Nani) అభిప్రాయపడ్డారు. రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Budha Venkanna: కేశినేని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఏమన్నారంటే..

Budha Venkanna: కేశినేని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఏమన్నారంటే..

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడన్నారు.

Kesineni Nani : టీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం లేదు : కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

Kesineni Nani : టీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం లేదు : కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

ఎంపీ కేశినేని నాని నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులూ లేవన్నారు. కేంద్ర హోం మత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు. అభివృద్ధి విషయంలో ‌తాను పార్టీలు చూడబోనన్నారు. అందరినీ కలుపుకుని ప్రజల కోసం పని‌చేస్తానన్నారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనన్నారు. తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారన్నారు.

Budha Venkanna : ముందస్తుకు వెళ్ళినా... వెనకస్తుకి వెళ్లినా గెలుపు టీడీపీదే..

Budha Venkanna : ముందస్తుకు వెళ్ళినా... వెనకస్తుకి వెళ్లినా గెలుపు టీడీపీదే..

ఏపీ సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారన్నారు. గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి...కబ్జా చేశారని ఆరోపించారు.

Kesineni Nani: మళ్లీ ఏమైంది నాని.. ఆ ఒక్క మాటను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్..

Kesineni Nani: మళ్లీ ఏమైంది నాని.. ఆ ఒక్క మాటను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్..

‘విజయవాడ ఎంపీ టికెట్‌ ఏ పిట్టల దొరకిచ్చినా నాకు అభ్యంతరం లేదు, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానేమో..’ అంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

TDP MP Kesineni Nani: కాకరేపుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా వ్యాఖ్యలు.. బెజవాడ టీడీపీలో ఏం జరుగుతోంది..?

TDP MP Kesineni Nani: కాకరేపుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా వ్యాఖ్యలు.. బెజవాడ టీడీపీలో ఏం జరుగుతోంది..?

విజయవాడ లోక్‌సభ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయని, ఒకటి చంద్రబాబు, రెండోది జగన్‌ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం కొసమెరుపు. విరోధాలు ఆ ఇద్దరి మధ్యే గానీ తమ మధ్య లేవని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

Kesineni Nani : బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నేను చెయ్యను

Kesineni Nani : బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నేను చెయ్యను

జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఔదార్యం ప్రదర్శించారు. పేదవానికి ఉచితంగా సి.యన్.జి ఆటోను బహూకరించారు. దానిని ఎంపీ కేశినేని నాని చేతుల మీదుగా అందజేశారు. ఆ తరువాత ఆటోలో కేశినేని నాని కొద్ది దూరం ప్రయాణించి వచ్చారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి