Home » Kesineni Chinni
TDP Tiruvuru Issue: తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు.
MP Kesineni Sivanath: అమరావతి రాజధానిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గత మూడేళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకెళ్లారు.
Nandigama Municipal Chairman: నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.
MP Kesineni: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్‌కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.
Minister Nimmala Ramanaidu: గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మంత్రి నిమ్మల రామానాయడు విమర్శించారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్‌లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.
Andhrapradesh: ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, అమరావతి అని తెలిపారు.
ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరతారనిమంత్రి నారాయణ అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారు అయ్యాను’’ అని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.
Andhrapradesh: ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.