Home » Kerala
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు మోహన్ లాల్.. ఆదివారం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతోపాటు కండరాల నొప్పులతో ఆయన బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్‌తో ఆయన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.
పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.
కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో భారత సైన్యంతో కలిసి ఆర్మీ దుస్తులు ధరించి సహయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చెకుతాన్ యూట్యూబ్ చానెల్ నిర్వహకుడు అజు అలెక్స్.. మోహన్ లాల్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని సమాచారం.
కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.
తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు.