Home » Kanaka durga temple
Durgamma Temple: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొత్తరకం దందా వెలుగులోకి వచ్చింది. అమ్మవారి దర్శనం కల్పిస్తామని మాయ మాటలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నయా దందాను ఆలయ అధికారులకు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీఐపీల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని చంద్రబాబు అన్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవాని దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.
దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. దుర్ఘతలను పోగొట్టే దుర్గాదేవిని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు.
Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా అమ్మవారి సేవలో మంత్రి పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పవన్కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వచ్చారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చూడగానే భక్తులలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు.