• Home » Kamareddy

Kamareddy

Road Accidents.. తెలంగాణ: వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి..

Road Accidents.. తెలంగాణ: వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి..

సంగారెడ్డి: తెలంగాణలోని వేర్వేరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్‌(Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు.

Suicide: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

Suicide: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్‌తో 2015లో వివాహం జరిగింది.

R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..

R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..

కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Banswada: ఒకేరోజు ఇద్దరు మునిసిపల్‌ కమిషనర్ల సస్పెన్షన్‌

Banswada: ఒకేరోజు ఇద్దరు మునిసిపల్‌ కమిషనర్ల సస్పెన్షన్‌

అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్‌ కమిషనర్లను సస్పెండ్‌ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్‌ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్‌ మునిసిపల్‌ కమిషనర్‌, ప్రస్తుత తుర్కయాంజల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

గండిపేట మండలం నార్సింగ్‌ మునిసిపాలిటీని అధికార కాంగ్రెస్‌ దక్కించుకోగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అక్కడ ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన మునిసిపాలిటీచైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు కాంగ్రెస్‌ సభ్యులు కూడా అనుకూలంగా ఓటేశారు. శనివారం నార్సింగ్‌ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌గా ఉన్న రేఖ, వైస్‌చైర్మన్‌గా ఉన్న వెంకటేశ్‌ యాదవ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది.

TG: నెత్తురోడిన రహదారులు..

TG: నెత్తురోడిన రహదారులు..

అతి వేగంతో వాహన ప్రయాణం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రాంసాన్‌పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం తాడ్కూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌(35), సునీత(30) దంపతులకు కుమారుడు నగేష్‌(7) ఉన్నాడు. వీరు ముగ్గురు శుక్రవారం బైక్‌పై తాడ్కూర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు.

Hyderabad: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌ స్వాధీనం..

Hyderabad: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌ స్వాధీనం..

అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్‌ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్‌లో ప్రకటించారు. మాల్‌లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు.

TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..

TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..

మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

Kamareddy: పోలీసుల అదుపులో కామారెడ్డి  డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌

Kamareddy: పోలీసుల అదుపులో కామారెడ్డి డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ సింగ్‌, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్‌ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి