Home » Kalyanadurgam
కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యా యి.
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు.
భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అయితే ఆ పొలాలకు దారి లేదంటూ అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండ లంలోని గుండ్లపల్లి ఎస్సీ కాలానికి చెందిన లబ్ధిదారులు వాపోతున్నారు.
పేదల సంక్షేమానికి ఎన్టీ ఆర్ అహర్నిశలు కృషి చేసి, వారిగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొనియా డారు. పట్టణంలోని సిరి కన్వెన్షన హాల్లో గురువారం మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బడుగు బలహీనవ ర్గాలకు అణగారిన వర్గాలకు సుపరిపాలన టీడీపీ ఆవిర్భావంతోనే మొద లైందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడును వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించిన నేపథ్యంలో, దానిని వీక్షించడానికి పట్టణంలోని సిరీ కన్వెన్షన హాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్చువల్ ఏ ర్పాట్లు చేయించారు.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని ఎంఈవో గోవిందరా జులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మంగళవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి మండలంలోని యలగలవంక ప్రాథమిక పాఠశాల పరిధిలో బడిబాట ఎనరోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ మహానా డు నిర్వహణకు పట్టణంలోని ఓ కన్వెన్షన హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు పరిశీలించారు.
రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మండల విద్యాశాఖాఽ దికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని కరిగానపల్లిలో ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గురు వారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.
ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను ఇతర ఎలాంటి పన్నులైనా తగ్గిస్తాం మాకేం ఇస్తారు అంటూ కొందరు మున్సిపాల్టీలోని సచివాలయ సిబ్బంది బేరసారాలకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలోని కొందరు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై ఇటీవల అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.