Home » Kakinada
తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చల విడితనం.. కన్నేసిన ప్రతిదాన్నీ కబ్జా చేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. కాకినాడ సీ పోర్టును హస్తగతం చేసుకోవడానికి అప్పటి సీఎం జగన్ అచ్చం ఇలాగే జగన్నాటకం ఆడారు.
Vijayasai Reddy-Kakinada Port: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ..
ఒక ప్రభుత్వమే మాఫియా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి.
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యమని అధికారులు నిర్దారణకు వచ్చినట్లు సమచారం. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాలజీ న్యాయస్థానంలో నిలబడే అవకావం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం కష్టమైన పని, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు.
రేషన్ బియ్యం లోడైన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసుపెట్టినా అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు.
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్నా డీ గ్యాంగ్‌కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేదంటే బయట వ్యాపారుల నిలువలేని పోర్టు గేట్లు కూడా తాకలేవు.
కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పిటిషన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యాయపరమైన చిక్కులు అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంగంలోకి దిగారు. కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సీజ్ ఆర్డర్ రావడానికి కేసు ఎలా ఉండాలనేదానిపై అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.
కాకినాడ: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్ తగిలింది. రొయ్యల ప్రోసెస్ ద్వారా వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. ఫ్యాక్టరీల కాలుష్యంపై పీసీబీకి దొంగ లెక్కలతో మాయ చేస్తున్నారు. అనుమతి లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్లు మాయ చేసి చూపారు. వీటి ఉల్లంఘనలను అధికారులు తనిఖీల్లో గుర్తించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా సోమవారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం... ఆ వెంటనే ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష...