Home » Kakinada City
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న పవన్ తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ తన నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టలేక కాకినాడ రూరల్‌లో సభ పెట్టాడని విమర్శించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. జనసేన పార్టీని పవన్ ఎవరిని ఉద్దరించేందుకు పెట్టాడని ప్రశ్నించారు. పవన్ వెనుక పార్టీలో ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు.