Home » KADAPA
వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల చిన్నారి పై యువకుడు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసాడు. చర్చి వెనుక ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం కనబడింది. రక్తపు మరకలతో సోదరులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది.
Covid 19: ఏపీలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న విశాఖలో ఒక కొవిడ్ పాజిటివ్ కేసు నమోదు అవగా.. తాజాగా కడప జిల్లాలో మరో కేసు వచ్చింది.
కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను తొలగించిన ఉత్తర్వుల్లో జోక్యం లేదని పిటిషన్‌ను కొట్టివేసి, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది.
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్‌లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పంట సాగు చేసిన రైతులు కుదేలవుతున్నారు. కాయలను మార్కెటుకు తీసుకువెళ్తే కూలీల డబ్బులు సైతం రావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక చేసేదేమి లేక పండిన టమోటా పంటను కొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తుండగా.. మరికొందరు రైతులు కాయలను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. దిగు
కడప జిల్లా పబ్బాపురం వద్ద 125 ఎకరాల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. చివరిరోజు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
TDP Mahanadu 2025: కడప జిల్లాలో మే27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
AP News: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ మేయర్ సురేష్ బాబుల మధ్య గత కొంత కాలంగా కుర్చీ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సురేశ్ బాబు పదవి పోవడానికి ఈ వివాదమే కారణమని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు.
వైసీపీకి అనుకూలంగా ప్రవర్తించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నిర్ధారణ కాగా, ప్రభుత్వంలో ఉన్న అనుచరుల వల్ల చర్యలు ఆలస్యం అయ్యాయి. చార్జిషీట్లు నమోదైనా జీఏడీ గప్‌చుప్ వ్యవహారం అధికారులు విమర్శకు లోనవుతోంది
TDP Mahanadu: కడప జిల్లాలో తొలిసారి పసుపు పండుగ మహానాడు జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కమిటీలు వేసి వాటి ద్వారా మహానాడును విజయవంతం చేస్తామన్నారు.