Home » kadambari Jethwani
Andhrapradesh: ఈ కేసులో సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకు ఇవ్వడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముంబయి నటి కాదంబరీ జత్వానీ(kadambari jatwani) కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుతో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘పోలీసులు ఉన్నది ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత ప్రతీకారాలకు వాడుకుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజా పోలీసింగ్‌కే ప్రాధాన్యమిస్తాం.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని ముంబై నటి కాదంబరి జెత్వానీ హోం మంత్రి అనితను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు.
తనను మానసికంగా, శారీరకంగా వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారని ముంబై నటి కాదంబరి జెత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కోరానని అన్నారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి కాదంబరి జెత్వాని ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇవాళ (గురువారం) హోంమంత్రి అనితను కలవనున్నారు. మరి కాసేపట్లో సెక్రటేరియట్‌లో మంత్రితో భేటీ కానున్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని ఆమె కోరనున్నారని తెలుస్తోంది.
అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు అనేక ములుపులు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపీయస్ అధికారులే కాదు... ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ పేరు బయటకొచ్చింది. ఉన్నతాధికారులు ఆదేశించడం.. చట్ట విరుద్దమైనా రెచ్చిపోవడం ఆ మహిళా ఎస్ఐ తీరు..