Home » Jupally Krishna Rao
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని కేసీఆర్... అధికారంపై పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో నారాయణపూర్ జలాశయం నుంచి 4 టీఎంసీలు విడుదల చేయడానికి కర్ణాటక సర్కారు అంగీకరించింది.
రాజేంద్రనగర్(Rajendranagar)లోని ఎక్సైజ్ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాడమీలోని సదుపాయాలు, అక్కడి పరిస్థితులను శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎక్సైజ్ కానిస్టేబుళ్లను అడిగి తెలుసుకున్నారు.
హుస్సేన్‌సాగర్(Hussain Sagar)లో ఆదివారం మహాహారతి సందర్భంగా బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చి బోటు ప్రమాదానికి కారణమైన అధికారిని సస్పెండ్ చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు.
సంక్రాంతి పండగకు ఈ సారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో త్వరలోనే కొత్త బ్రాండ్లతో కూడిన బీర్లు రానున్నాయి. ఈ మేరకు బీర్ల ఉత్పత్తి కోసం మద్యం కంపెనీలను ఆహ్వానించాలని.. దరఖాస్తులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ) సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Minister Jupalli Krishna Rao: కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కేసీఆర్ ప్రజలకు మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడితే ఆధారాలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్న లక్నవరం చెరువుకు జలగండం పొంచి ఉంది. చుట్టూ కొండల నడుమ విశాలంగా పరుచుకున్న చెరువులోని దీవుల్లో విడిది చేయడం, పడవల్లో విహారం, ఉయ్యాల వంతెనలపై నడక పర్యాటకులకు ఇప్పుడైతే మధురానుభూతి కలిగిస్తోంది.
గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చం దంగా ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు.