• Home » Jubilee Hills

Jubilee Hills

Breaking: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Breaking: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.

Road Accident Case: జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు..ముందస్తు బెయిల్‌కు రాహిల్‌ పిటిషన్‌

Road Accident Case: జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు..ముందస్తు బెయిల్‌కు రాహిల్‌ పిటిషన్‌

జూబ్లీహిల్స్‌లో 2022లో కారు ప్రమాదంతో ఓ చిన్నారి మరణం, ఇద్దరు తీవ్ర గాయాలపాలవ్వడానికి కారకుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ అలియాస్‌ సాహిల్‌ బెయిల్‌ కోసం బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.

Hyderabad: కిలోమీటర్‌ ప్రయాణానికి 45 నిమిషాలు...

Hyderabad: కిలోమీటర్‌ ప్రయాణానికి 45 నిమిషాలు...

ఒక్క అడుగు ముందుకు కదలాంటే ఐదు నిమిషాలు.. కిలోమీటర్‌ ప్రయాణానికి ఏకంగా 45 నిమిషాల సమయం. ఇదీ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు45(Jubilee Hills Road No.45)లోని వాహన చోదకుల పరిస్థితి.

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

TS News: రాహిల్‌‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

TS News: రాహిల్‌‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్‌కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Hyderabad: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రెచ్చిపోతున్న అకతాయిలు..

Hyderabad: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రెచ్చిపోతున్న అకతాయిలు..

హైదరాబాద్‌లో పాష్ ఏరియాలు అంటే.. చటుక్కున గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. అయితే ఆ యా ప్రాంతాల్లో అకతాయిలు రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామో అనే సోయ లేకుండా వారు వ్యవహరిస్తున్నారు. దీంతో సదరు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు.

Hyderabad: బంజారాహిల్స్‌లో ‘స్టోన్‌ బ్యాచ్‌’.. వ్యాపార సముదాయాలపై రాళ్ల దాడి

Hyderabad: బంజారాహిల్స్‌లో ‘స్టోన్‌ బ్యాచ్‌’.. వ్యాపార సముదాయాలపై రాళ్ల దాడి

బంజారాహిల్స్‌(Banjara Hills)లో జులాయిలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్‌ 2లో సాయంత్రం 7-8 గంటల సమయంలో తిరుగుతూ వ్యాపార సముదాయాలపై రాళ్లు రువ్వి పారిపోతున్నారు. ఈ దాడి కారణంగా పెద్దశబ్దాలతో అద్దాలు పగిలిపోతుండటంతో వ్యాపారులతోపాటు వినియోగదారులు భయపడుతున్నారు.

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్‌ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.

TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు

TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు

Telangana: రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి