• Home » Jogi Ramesh

Jogi Ramesh

 Jogi Ramesh : అగ్రి గోల్డ్‌ భూములతో దందా!

Jogi Ramesh : అగ్రి గోల్డ్‌ భూములతో దందా!

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబం అగ్రి గోల్డ్‌ భూములను చెరబట్టింది. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి అప్పనంగా రూ.5కోట్ల పైచిలుకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్‌ఎస్‌ నం.69/2, రీసర్వే నం.87లో అగ్రిగోల్డ్‌కు చెందిన సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది.

Bode Prasad: జోగి రమేష్‌కు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది

Bode Prasad: జోగి రమేష్‌కు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది

జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.

AP Elections: ‘సీ విజిల్’ యాప్‌లో ఫిర్యాదు.. వైసీపీ అభ్యర్థి గిఫ్ట్‌ ఆఫర్స్ సీజ్

AP Elections: ‘సీ విజిల్’ యాప్‌లో ఫిర్యాదు.. వైసీపీ అభ్యర్థి గిఫ్ట్‌ ఆఫర్స్ సీజ్

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు నేతలు. నగదు, మద్యం, చీరలు, రకరకాల వస్తువులను ఇచ్చి ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు ఈసీ, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ఈసీ, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపట్టింది.

Minister Jogi Ramesh:  జోగి రమేశ్ తనయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు

Minister Jogi Ramesh: జోగి రమేశ్ తనయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు

మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజేష్ దాడి చేశాడు.

AP Politics:  మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.

AP Elections: మా మీద జగన్‌కి విపరీతమైన కోపం

AP Elections: మా మీద జగన్‌కి విపరీతమైన కోపం

వైసీపీ అధినేత వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

AP News: జోగి రమేష్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..?

AP News: జోగి రమేష్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..?

వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్‌ (Jogi Ramesh)కు ఎస్‌ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.

AP News: పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్ బట్టలూడదీసి తంతాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక

AP News: పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్ బట్టలూడదీసి తంతాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక

మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి