Home » Jharkhand
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుందని ఝార్ఖండ్ ముక్తి మోర్చ నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ జోస్యం చెప్పారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో తన పార్టీ మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు.
ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. దాంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారాయి. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఫలితాలు పునరావృతం కాకుండా బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు(heat wave) కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా 210 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.
ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లో శనివారం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.