Home » Jharkhand
జార్ఖండ్‌లో కాకలు తిరిగిన గిరిజన నేతగా పేరున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ హస్తినలో ఆదివారంనాడు అడుగుపెట్టడం వెనుక కారణం ఏమిటనే సస్పెన్స్ కొనసాగుతోంది.మీడియా అడిగిన రెండు ప్రధాన ప్రశ్నలకు సూటి సమాధానం దాటవేశారు.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి హస్తినకు ఆదివారంనాడు చేరుకున్నారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరనున్నారంటూ గత రెండురోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామం బలం చేకూరుస్తోంది.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తొలిసారి స్పందించారు. ''నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నా'' అని బదులిచ్చారు.
రాజకీయాల్లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరూ చెప్పలేం. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ గుడ్‌బై చెప్పనున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు.బీజేపీ లీడర్లతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరపుతున్నారని, త్వరలోనే ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారని భోగట్టా.
సభ వ్యవహారాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో 18 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి రెండ్రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకి రావడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో మార్షల్స్ వారిని ఎత్తుకుని బయటకు పంపేశారు.
జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.
మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.
భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి జార్ఖండ్ సీఎం సొరేన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్ 28న ఇచ్చిన బెయిల్ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్‌కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది.