Home » Jharkhand
హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులోభాగంగానే చంపయి సోరెన్ పార్టీ వీడారని పేర్కొంది. అదివాసీల సంక్షేమం కోసం సోరెన్ కుటుంబం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి హేమంత్ సోరెన్‌ను బీజేపీ జైలుకు పంపిందన్నారు.
జార్ఖాండ్ ముక్తి మోర్చా తిరుగుబాటు నేత చంపయీ సోరెన్ బీజేపీలోకి రానుండటంపై బీజేపీ జార్ఖాండ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశాలున్నాయి.
జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న రాంచీలో అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తన అధికారిక X ఖాతాలో ఓ పోస్ట్ చేసి ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని బీజేపీ, ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ నిర్ణయించాయి. ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Jharkhand Politics: జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ ఢిల్లీ నుండి సెరైకెలాలోని తన ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన జేఎంఎంను వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ కారణంగానే..
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీడియోలకు తెగ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో రకరకాల పేర్లతో ఛానెళ్లు ఓపెన్ చేసి వంట, ట్రావెలింగ్, ఫ్యాషన్ సహా పలు రకాల వీడియోలు పోస్టు చేస్తూ చాలా మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అయితే తాజాగా ఓ ట్రక్ డ్రైవర్ కూడా యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యారు. తనకున్న టాలెంట్‌తో నెలకు లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దీంతో ఆయన సంపాదన విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
శాసనసభ ఎన్నికల ముందు.. జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. అధికారికంగా పార్టీకి రాజీనామా చేయడం మాత్రమే మిగిలిఉంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఏంఏంలో సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ కాక రేపుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నెలన్నర రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తట్టుకోలేక పోతున్నానని వివరించారు. హేమంత్ సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను తెలిపారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత చంపై సోరెన్ తన X ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించారు. దీంతో చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.