Home » Jharkhand
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (బుధవారం) మరో ముఖ్యమైన పథకాన్ని ఆవిష్కరించారు.
జార్ఖాండ్‌లోని సరాయకేలా జిల్లా ఛాందిల్ స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవాంతరం కలిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో రైల్వే ట్రాక్ బాగా దెబ్బతింది.
మనుషులను పోలిన మనుషులు లోకంలో చాలా మందే ఉంటారు. అయితే.. అలా పోలిక ఉన్న వారిలో ప్రముఖులు ఉంటే.. అది ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది.
జార్ఖాండ్‌లో 2024 ఎన్నికలకు సంబంధించిన బీజేపీ పరివర్తన ర్యాలీని హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు ప్రారంభించారు. ఇక్కడి నుంచి మొదలైన పరివర్తన యాత్ర రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి, ఇంటింటికి చేరుకుంటుందని చెప్పారు.
జార్ఖండ్‌కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు జల్లాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) వ్యవహారించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్‌ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దాహం కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను.. ఆ దేశం నుంచి రోహింగ్యాల రూపంలో చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ జేఎంఎంతోపాటు కాంగ్రెస్, ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
ఈరోజు 6 కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ(narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందేభారత్ రైలు నిర్వహణతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఏఎం మాజీ సీనియర్ నేత చంపయీ సోరెన్ (Champai Soren) ఎట్టకేలకు సొంత పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ (BJP)లో శుక్రవారంనాడు చేరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, జార్ఖాండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మిరాండి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కేబినెట్‌లో మంత్రిగా రామదాస్ సోరెన్ శుక్రవాం ప్రమణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో రామదాస్ సోరెన్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు.