Home » Jeevan Reddy
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అలక వీడారు. కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ భవన్(Telangana Bhavan) శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) భేటీ ముగిసింది. సమావేశ అనంతరం బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియా ప్రశ్నించగా.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనంటూ బదులిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక.. కాంగ్రె్‌సలో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి..
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన హస్తం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపరాఫర్ ఇచ్చింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ చేశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మున్షీ చెప్పినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.
బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున రచ్చకు కారణమవుతోంది. సంజయ్ చేరికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.