Home » Jeevan Reddy
బీఆర్ఎస్లో చేరికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నేడు కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు టీ. జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. మంగళవారం జగిత్యాలలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్.. జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం జీవన్ రెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ప్రకటించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది.
తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అత్యంత సీనియర్, గౌరవప్రదమైన నాయకుడు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కి వెన్నుముకగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై పలు కీలక వ్యాఖ్యలు చేయడంతో జగిత్యాలలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాల్లోకి వెళితే..