Home » JC Prabhakar Reddy
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచె విప్పి కొడతామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. గెలిచినా, ఓడినా ఫ్యాక్షన మొదలు పెడతానని పెద్దారెడ్డి బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చశారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వైసీపీ హయాంలో ..
‘వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబాన్ని వేధించారు. దొంగ బస్సులు తెచ్చామని కేసులు పెట్టారు. అధికారులకు పది రోజులు గడువు ఇస్తున్నా. నేను దొంగనని నిరూపించాలి. లేదంటే ఎస్పీ ఆఫీస్ వద్ద నా కొడుకు, కోడలు.. డీటీసీ ఆఫీస్ వద్ద నేను, నా భార్య కూర్చుంటాం’ అని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ....
వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని.. తమను దొంగలుగా చిత్రికరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బీఎస్ 4 వాహనాలను కొనుగోలు చేశామని.. బీఎస్4 వాహనాలను అమ్మినవాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పింది..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ మరుసటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో భద్రతకు వచ్చిన పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయ్..
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్‌పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Andhrapradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. తాడిపత్రిలో టియర్ గ్యాస్ ఎఫెక్ట్ వల్లే జేసీ అనారోగ్యానికి గురయ్యారు. ఆందోళన కారులను చెదరగొట్టడంలో భాగంగా నిన్న కాంచన ఆసుపత్రి సమీపంలో పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే జేసీ ప్రభాకరరెడ్డి సమీపంలో టియర్ గ్యాస్ పడింది.
తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్‌పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్‌ను వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికివేశారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలించారు.
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్ ప్రభాకర్ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాఖలు చేసింది.