Home » JANASENA
పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలను పార్టీ ప్రారంభించింది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్లు, సరఫరాల అధికారులదే కీలక పాత్ర అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం మీడియా ముందు బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టారు. కిరణ్ మాటలు విని చాలా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అతను ఇప్పుడు తనను కిలాడీ లేడి అంటున్నారని చెప్పారు.
Pawan Kalyan: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి జరిగింది. ఈ దాడి చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ పోలీసులను కోరారు. ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
Samineni Udaya bhanu: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలని ముందుకు సాగుతున్నారని జనసేన నేత సామినేని ఉదయభాను అన్నారు. తన మీద పవన్ కల్యాణ్ పెట్టిన నమ్మకం నిలబెట్టేలా పని చేస్తానని చెప్పారు. కూటమి పార్టీల నేతల మధ్య ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
కూటమి పార్టీల తరఫున తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి భారీ ప్రదర్శనగా ఆలపాటిని గుంటూరు కలెక్టరేట్‌కు ఊరేగింపుగా తోడ్కొనివెళ్లారు.
అహుడా చైర్మన టీటీసీ వరుణ్ అనంతపురం నగరంలో గురువారం పర్యటించారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో కలియ తిరిగారు.
Nagababu: అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని జనసేన అగ్రనేత నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు ఆ పార్టీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలని... ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని.. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు.
జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.