Home » Jai Shankar
జైశంకర్‌కు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.
భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాగా మానవ అవశేషాల వేలం వేయలనే నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. బ్రిటన్‌లో నాగా మానవ అవశేషాలను బుధవారం అన్ లైన్ వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ వేలం వేయడంపై భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్ర విదే శాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నెలలో పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర
ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్‌ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇస్లామాబాద్ ఆహ్వానించిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో నిరంతర చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు.
భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే.
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్‌లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.