• Home » Jagtial

Jagtial

నారీ.. ఆర్థిక విజయభేరి..

నారీ.. ఆర్థిక విజయభేరి..

సిరిసిల్ల ఆర్థిక అవనిపై అతివలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లోనే కాదు పరుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో శక్తివంచన లేకుండా విజయభేరి మోగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలతో ముందడుగు వేస్తున్నారు.

ఆదిలోనే ఆలస్యం..

ఆదిలోనే ఆలస్యం..

ఇంటి స్థలం ఉన్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆరంభంలోనే జాప్యమవుతున్నాయి. పైలట్‌ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు అర్హులైన 1,409 మందికి ఇళ్లను మంజూరు చేశారు.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం

ప్రయాణికులకు మెరుగైన సౌక ర్యాల కల్పనే రైల్వే సంస్థ ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు లో వచ్చిన జీఎంకు స్థానిక రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు.

ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యం

ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నుం చి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యమని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా చెప్పారు. శుక్రవారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల రోడ్‌ సేఫ్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీపై నమ్మకం, భరోసా కలగాలన్నారు.

నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

ఎల్‌ఆర్‌ ఎస్‌ దరఖాస్తులను నెలాఖరులోగా పూర్తిగా పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రధా న కార్యదర్శి ఎం దానకిషోర్‌ అన్నారు. శుక్ర వారం కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించిన అభ్యర్థులకు క్రమబద్ధీకరణ మంజూరు పత్రాలు వెంటనే అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12,30వరకు జరిగే పరీక్షలను ప్రశాం తంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పరీక్ష రాసే 7,393మంది విద్యార్థుల కోసం 41పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.

ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ దేశానికే ఆదర్శం

ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ దేశానికే ఆదర్శం

ఎస్సీ వర్గీకరణకు అసెం బ్లీలో చట్టబద్దత కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించి దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందడంపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జెండా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేసిన పోరాటానికి దారిచూపిన ఘనత కాంగ్రెస్‌ దేన న్నారు.

సాగునీటిని సమర్థవంతంగా వినియోగించాలి

సాగునీటిని సమర్థవంతంగా వినియోగించాలి

ఎస్సారెస్పీ కింద యాసంగి నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా విని యోగించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం డీ83 కాలువ కింద యాసంగి పంటకు నీటి విడుదలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కింద యాసంగికి 7 తడులలో 6 తడులను ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు.

భవిత కేంద్రాలకు భరోసా

భవిత కేంద్రాలకు భరోసా

భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల స్థాయి చిన్నారులకు భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీ (ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌) బోధన అందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో సరైన సౌకార్యలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ముందస్తు జాగ్రత్తలు మేలు..

ముందస్తు జాగ్రత్తలు మేలు..

జిల్లాలో ఇటీవల కేన్సర్‌ కేసులు పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో కేన్సర్‌ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)లో చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి