• Home » Jagtial

Jagtial

ఘనంగా రంజాన్‌

ఘనంగా రంజాన్‌

జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విని ఆధ్యాత్మిక భావంతో పరవశించిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుల, మతాతీలకు అతీతంగా బంధు మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు.

మైనింగ్‌ శాఖలో సిబ్బంది కొరత

మైనింగ్‌ శాఖలో సిబ్బంది కొరత

జిల్లా మైనింగ్‌ శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వేదిస్తోంది. పోస్టులు మంజూరు కాకపోవడం, మంజూరు అయిన పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటుండడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. దీంతో మైనింగ్‌ శాఖలోని అధికారులు ప్రజలకు అందుబాటులోకి రావడమే గగనంగా మారుతోంది.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

రామగుండం అభి వృద్ధికి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని, ప్రస్తు తం అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉన్నా యని, పనుల్లో వేగం పెంచాలని రామగుండం ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ అరుణశ్రీ, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలి త్‌కుమార్‌, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

సాయికుమార్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి

సాయికుమార్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి

ముప్పిరితోటలో ప్రేమ పేరుతో ఈనెల 27న జరిగిన సాయికుమార్‌ దారుణహత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పౌరహక్కుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ముప్పిరి తోట గ్రామాన్ని సందర్శించారు.

 ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

ప్రజల ప్రాణాలు పోతున్నా హెచ్‌కేఆర్‌ రోడ్డు సంస్థ పట్టించు కోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు మండిపడ్డారు. ప్రమాదాలకు నిలయంగా మారి నిత్యం వాహనాలు బోల్తాపడుతున్నా మూలమలుపును సీపీఐ బృందం సోమవారం పరిశీ లించింది.

 జోరుగా అక్రమ మట్టి దందా

జోరుగా అక్రమ మట్టి దందా

ధర్మారంలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి తీయాలంటే ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

 గురుకులం ఎదుట తల్లిదండ్రుల పడిగాపులు

గురుకులం ఎదుట తల్లిదండ్రుల పడిగాపులు

ఉగాది పండుగ పూట పిల్ల లను కలిసేందుకు తల్లిదండ్రులు పడిగాపులు కాశారు. స్థానిక రమేష్‌ నగర్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల(గుంజపడుగు) వద్ద ఆదివారం పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు వచ్చారు.

కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత

కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత

సాగునీటి కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఎస్సారెస్పీ కాలువలను ధ్వంసం చేస్తే ఎవరినీ ఉపేక్షిం చేది లేదని ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరిం చారు. సుల్తానాబాద్‌ సహకార సంఘం సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది.

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి

మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మం గళవారం కలెక్టరేట్‌లో రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల బడ్జెట్‌ తయారీపై అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు.

క్షయ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

క్షయ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

క్షయ వ్యాధికి గురి కాకుండా జగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అన్నా ప్రసన్న కుమారి సూచించారు. క్షయ వ్యాది నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అమర్‌ చంద్‌ కల్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి