• Home » Jagitial

Jagitial

Gurukul school: పెద్దాపూర్‌ గురుకులంలో విద్యార్థి మృతి

Gurukul school: పెద్దాపూర్‌ గురుకులంలో విద్యార్థి మృతి

అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఇద్దరు గురుకుల విద్యార్థులను తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

MLC Jeevan Reddy: ఆ గురుకుల పాఠశాలలో వరస మరణాలు బాధాకరం..

MLC Jeevan Reddy: ఆ గురుకుల పాఠశాలలో వరస మరణాలు బాధాకరం..

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి, లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Student Death: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు..

Student Death: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు..

మెట్‌పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల(Peddapur Gurukula School)లో విద్యార్థుల వరస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు. తమ పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Loan waiver: ఇదేం చోద్యం.. రుణం రూ.2 లక్షలు.. మాఫీ 3వేలా!

Loan waiver: ఇదేం చోద్యం.. రుణం రూ.2 లక్షలు.. మాఫీ 3వేలా!

రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

KTR: కవితక్క త్వరలో వస్తది... జగిత్యాలలో తిరుగుతది: కేటీఆర్‌

KTR: కవితక్క త్వరలో వస్తది... జగిత్యాలలో తిరుగుతది: కేటీఆర్‌

ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్‌క్వాలిఫై చేయాలని రాహుల్‌ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

Jagityala: అంజన్న చెంతన పవన్‌..

Jagityala: అంజన్న చెంతన పవన్‌..

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

HYderabad: ..వానొచ్చింది!

HYderabad: ..వానొచ్చింది!

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగు పనులు ఊపందుకోనున్నాయి. తొలకరి వానలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పలు చోట్ల మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

G. Jagadish Reddy: స్పీకర్‌.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు..

G. Jagadish Reddy: స్పీకర్‌.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు..

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌ కుమార్‌ కాంగ్రె్‌సలో చేరడం చట్ట వ్యతిరేకమని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే జి.జదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి