Home » Jaggareddy
ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఈ మేరకు బడ్జెట్‌ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హస్తం నేతలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్‌కు ఎన్ని నిధులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ నిన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు.
సోనియా, రాహుల్, ఖర్గేల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని.. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.
గురువారం సాయంత్రం 4 గంటల నుంచి.. సోనియా, రాహుల్ డైరెక్షన్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం.. రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు..
రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు.. ఆయన నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రొటోకాల్‌ను పాటించని కేటీఆర్, హరీశ్‌రావులు.. ఇప్పుడు ప్రొటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు..
బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని.. ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగాలని.. మర్యాద లోపం ఉంటే తప్పు పట్టాలని అన్నారు.
టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తూర్పు నిర్మలా జగ్గారెడ్డి.. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.