Home » Jagan Cases
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్ కంప్లయింట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ బంధువులకు పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.
ఆస్తులు లాక్కోవడం జగన్ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్ అయితే..
ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టును అనాథను చేశారని తేటతెల్లమైంది. ఆయన నిర్వాకం కారణంగానే కాఫర్ డ్యాంల్లో సీపేజీ ఎగదన్నుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020, 2021 వరదల కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని..
అరాచకమే హద్దుగా చెలరేగిపోయిన వైసీపీ తన ఐదేళ్ల పాలనలో చేయని దౌర్జన్యాలు లేవు. దేనిపైనైనా అప్పటి సీఎం జగన్ కన్ను పడితే చాలు.. బెదిరించడం.. అడిగింది ఇవ్వనంటే కేసుల బూచితో దారికి తెచ్చుకోవడం.
రేషన్ బియ్యం లోడైన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసుపెట్టినా అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అప్పటి సీఎం స్థానంలో ఉన్న జగన్ పలు ఆరోపణలు చేశారని, అవన్నీ నిరాధారమని పిటిషనర్ పేర్కొన్నారు.
జగన్ జమానాలో జరిగిన వ్యవస్థల విధ్వంసంలో జిల్లాల పునర్విభజన ఒకటి. జగన్ సర్కారు పోయినా ఆయన చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు.
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్‌కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.