Home » IT Raids
సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండోరోజైన బుధవారం కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
IT Raids: మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఇన్‌కంటాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజ్ (Producer Dil Raju) ఇల్లు, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు మూవీల ఆదాయ వ్యయాలపైనా ఐటీ విచారణ చేస్తోంది.
హైదరాబాద్: ఇన్‌కంటాక్స్ అధికారుల సోదాలు రెండోరోజు బుధవారం హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. నిన్న నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్లు తెరిపించారు. బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈరోడ్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి(Edappadi K. Palaniswami)కి చెందిన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మూడో రోజైన బుధవారం కూడా తనిఖీలు చేశారు.
పెద్దాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దాపురం శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ (ఇన్‌కంట్యాక్స్) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సంస్థకు సంబంధించి పట్టణ పరిధిలో ఉన్న పలుచోట్ల ఈ సోదాలను ఐటీ అధికారులు చేపట్టారు
నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు సాగాయి.
వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
బీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన కార్యాలయంపై ఐటీ శాఖ అదికారులు బుధవారం దాడులు చేశారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు రూ.60 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు.