Home » Israel
ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్‌పై కొనసాగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో దాదాపు 200 యుద్ధ విమానాలు మోహరించబడి, 100కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను కూల్చివేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ బలగాలు, మిలటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్‌లోని నాటాన్స్ యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ కేంద్రంతోపాటు పలు మిలటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.
Operation Rising Lion: ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లడానికి చూస్తోంది. ఇరాన్ దగ్గర ఒక్క అణు బాంబు కూడా లేదు. చాలా ఏళ్ల నుంచి అణు బాంబును తయారు చేయాలని శ్రమిస్తోంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై దాడులకు తెగబడుతోంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయెల్‌లో ముందు జాగ్రత్త చర్యగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు.
హమాస్ ఆస్పత్రి కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అనేక గదులతో కూడిన ఈ సొరంగం ద్వారా హమాస్ ఉగ్రవాదులు అనేక దురాగతాలకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ సొరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హమాస్ గాజా చీఫ్ మహ్మద్ సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్ బలగాలు గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్ మృతి చెందాడని కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో విషాదం చోటు చేసుకుంది. ఖాన్ యూనిస్‌పై దాడి చేసింది. ఈ ప్రాంతం డేంజర్ వార్ జోన్ అని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ క్యాబినెట్ గాజాను పూర్తిగా ఆక్రమించేందుకు కొత్త ఆపరేషన్‌ను ఆమోదించింది. ట్రంప్ పశ్చిమాసియా పర్యటన తరువాత ఈ ఆపరేషన్ ప్రారంభించనున్నారు
చాలా దేశాలను ఇసుక తుఫానులు వెంటాడడం చూస్తున్నాం. కొన్నిసార్లు ఈ తుఫానుల కారణంగా ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. తాజాగా, ఈ ఇసుక తుఫానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇజ్రాయెల్ అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న అన్ని సుంకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుందని వెల్లడించింది