Home » Israel Hamas War
ఇజ్రాయెల్(Israel) లెబనాన్(lebanon)లోని షియా మిలీషియా హిజ్బుల్లా(hezbollah) స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు(airstrikes) చేసింది. దీనికి ప్రతి స్పందనగా హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడిని ప్రారంభించింది. వీరు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులను ప్రారంభించారు.
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా..
గాజా(Gaza) నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్.. శనివారం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు.
అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్(Israel)లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం భద్రతా సలహాను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ(indian people) అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.
హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్ రక్షణలో ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్ మిలిటరీ చీఫ్, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్ డెయిఫ్ హతమయ్యాడు.