Home » Israel Hamas War
ఏడాది క్రితం నాటి హమాస్ దాడిలో మరణించినవారికి నివాళులర్పిస్తున్న కార్యక్రమాలే లక్ష్యంగా హిజ్బుల్లా, హమాస్ ఈ రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. టెల్ అవీవ్‌పై రాకెట్ దాడులు చేసినట్లు హమాస్ ప్రకటించింది. అటు యెమెన్ నుంచి హౌతీలు కూడా క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించారు. అయితే వాటిని తాము కూల్చివేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు...
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి నేడు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ దాడులు చేశారు. ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ రాకెట్లను పూర్తిగా ఆపడంలో విఫలమైంది.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!
సెంట్రల్ గాజా డెయిల్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు.
ప్రపంచంలో నేడు రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడుందని భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ప్రశ్నించారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతిచెందాడు.
పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బంకర్ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్ ఉంది.
ఇజ్రాయెల్ పదాతి దళాలు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి.. భూతల దాడులకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దుల్లో వైమానిక దళాలు, పారాట్రూపర్లతోపాటు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది.