Home » IPL
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఫ్యాన్స్, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. అయితే ఇలాంటి ఆటగాడు వచ్చిన బిహార్‌కూ ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని బిలియనీర్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. భారత్‌లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన వేదాంతా గ్రూప్‌నకు ఆయన ఛైర్మన్.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ప్లే ఆఫ్స్‌కు ముందే ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే వైఫల్యాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట తిరుగుతూ బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ నకిలీ టికెట్ల మోసాలపై క్రికెట్ అభిమానులను టీజీసీఎస్‌బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లను కేటుగాళ్లు విక్రయం చేస్తారని హెచ్చరించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు.
గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.