Home » Indian Railways
భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ప్రతిరోజు కోట్లాది మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పనిచేయడానికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారతదేశంలో అతిపెద్ద ప్రయాణ వ్యవస్థ భారతీయ రైల్వే. రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకుంటే రైలు ప్రయాణానికి మించిన సౌకర్యం వేరే ఎక్కడా ఉండదు. ఓ వ్యక్తి తన ప్రయాణం కోసం రైల్లో ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేసుకున్నాడు. ట్రైన్ ఎక్కి సీటు దగ్గరకు వెళ్ళగానే..
భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్న భారత దేశం అమృత కాలం ప్రారంభంలో ఉందని చెప్పారు. నూతన శక్తి, నూతన ప్రేరణ, నూతన సంకల్పాలు ఉన్నాయని తెలిపారు.
అతడో రైల్వే కానిస్టేబుల్(Railway Constable). కానీ మానసిక స్థితి సరిగా లేదో, లేక మతోన్మాదో తెలీదు కానీ.. తన చేతిలో ఉన్న మారణాయుధంతో ఓ ఉన్మాదిలా రెచ్చిపోయాడు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండూ మొరాయించడంతో ఉదయం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రెండింటిలో టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ అవకపోవడమే కాకుండా డబ్బులు కూడా కట్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుంచి పనిచేయని ఐఆర్‌సీటీ సైట్, యాప్ పనిచేయకుండా పోయాయి.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్‌కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
పవిత్రమైన శ్రావణ మాసంలో హలాల్ టీ ఇచ్చిన రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవలసి ఉందని, అటువంటి సమయంలో ఓ మతపరమైన సర్టిఫికేషన్ ఉన్న టీని ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆ ఉద్యోగి మాట్లాడుతూ, టీ శాకాహారమేనని ఆ ప్రయాణికునికి నచ్చజెప్పారు.
పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్ స్లీపర్, వందే మెట్రో, వందే సాధారణ్ రైళ్లను పరిచయం చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.
కర్నాటక: బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే డబుల్ డెక్కర్ రైల్లో ప్రమాదం జరిగింది. రైలు గుడియాత్తం స్టేషన్ చేరుకోగానే మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలు గమనించిన రైల్వే సిబ్బంది రైలును స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.