Home » India vs West indies
వెస్టిండీస్‌తో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా కలిసి 8 వికెట్లు పడగొట్టారు.
భారత్, వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ అందుకున్న ఓ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్ చివరి బంతిని వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్ వుడ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా టైమింగ్ కుదరకపోవడంతో బంతి మైదానంలోనే గాల్లోకి లేచింది.
వెస్టిండీస్‌తో ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/60) దుమ్ములేపాడు. తన స్పిన్ మాయజాలంతో విండీస్ బ్యాటర్లను వణికించడమే కాకుండా తొలి రోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆటను ఈ ఆఫ్ స్పిన్నర్ శాసించాడనే చెప్పుకోవాలి.
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (West Indies vs India) మధ్య డొమినికాలోని రోసో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఫస్ట్ సెషన్ ముగిసింది. లంచ్ సమయానికి ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు, శార్దూల్ థాకూర్, రవీంద్ర జడేజా చెరో వికెట్‌తో విజృంభించడంతో స్వల్ప స్కోర్లకే వెస్టిండీస్ కీలక బ్యాట్స్‌మెన్ వెనుదిరిగారు.