Home » India vs England Test Series
భారత క్రికెట్ వర్ధమాన ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ఆట తీరుతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటివల ఇంగ్లండ్ జట్టుపై తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన ఎదుట మరిన్ని క్రేజీ రికార్డులు ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. భారత్(India) చేతిలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బజ్‌బాల్ క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం.
టీమిండియా నయా చరిత్ర సృష్టించింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్ జట్టుని మట్టికరిపించింది. ఏకంగా 434 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ద్వారా టీమిండియా పలు రికార్డులను బద్ధలు కొట్టింది. ఆ రికార్డులు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి.
తల్లి అనారోగ్యం కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్లిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మూడో టెస్టు నాలుగవ రోజున అశ్విన్ తిరిగి జట్టుతో కలవనున్నాడని క్లారిటీ ఇచ్చింది. అంటే నేడు (ఆదివారం) జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రాజ్‌కోట్ మూడో టెస్టు రెండో రోజు కూడా ముగిసింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న సిరీస్ మూడో మ్యాచ్ రెండో రోజు చివరి సెషన్‌లో బెన్ డకెట్ సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు తొలి సెషన్ ముగిసింది. లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కాగా ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా 33 పరుగుల స్వల్ప స్కోరుకే కీలకమైన 3 వికెట్లు చేజార్చుకుంది. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఈ రోజు కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత్ తొలి టెస్టు ఓడినా.. రెండో టెస్టులో అద్భుత పోరాటం కనబర్చింది. పేసర్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో పర్యాటక జట్టును హడలగొట్టడంతోనే...
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. అయితే విశాఖ టెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం ఇంగ్లండ్ టీమ్ ఇండియా నుంచి దుబాయ్ వెళ్లనుంది. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.