Home » Independence Day
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద సంబంధిత ఘటనలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనె, జాతీయ భద్రతా సలహాదారులు అజితో ధోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 15, 2024న భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(independence day) జరుపుకోనుంది. ప్రతి ఏటా కూడా స్వాతంత్ర దినోత్సవం(ఆగస్టు 15), గణతంత్ర దినోత్సవం(republic day)(జనవరి 26) రోజున జెండా ఎగురవేస్తారు(flag hoisting). అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశం యావత్తు ఆగస్టు 15న దేశభక్తితో పులకరిస్తుంది. అయితే భారతదేశం మాత్రమే కాదు.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు కూడా ఉన్నాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్ దూరదర్శన్‌లోని అన్ని ఛానెల్‌లలో హిందీలో ఆపై ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రసారం చేయబడుతుంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే అనిశ్చితి ఓవైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం (GAD) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని తెలిపింది.
దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ఎగురవేస్తారు. అతిషిని జాతీయపతాకం ఎగురవేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారంనాడు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్ర్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే(KCR) గోల్కొండపై జెండా ఎగురవేసేవారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు(Independence day offer) సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిస్సాన్ సంస్థ ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది.